Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

కాలేజీలు, వర్సిటీలపై ప్రత్యేక నిఘా
మద్యం, గుట్కా, ఇసుక అక్రమ రవాణానూ వదలొద్దు
7వేల మంది పోలీసుల నియామకానికి చర్యలు
ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌
శాంతిభద్రతల సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : డ్రగ్స్‌, మద్యం, గుట్కా, ఇసుక అక్రమ రవా ణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, నేరాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదక ద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షిం చారు. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్‌ చెప్పారు. అక్రమ మద్యం తయారీ, అక్రమ రవాణాపై ఎస్‌ఈబీ సహా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కా రం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 15వేల మంది మహిళా పోలీసులను నియమించామని, వీరికి డిసెంబరు నాటికి శిక్షణ పూర్తిచేయాలని సూచించారు. ఇవిగాక వచ్చే ఏడాది 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకూ 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశారని, ఈ యాప్‌ ద్వారా 5,238 మందికి సహాయం చేశామని పోలీసు అధికారులు వివరించారు. దిశయాప్‌ ద్వారా ఈ ఏడాది రిజిస్టర్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 684 ఉన్నట్లు తెలిపారు. మహిళలపై నేరాల విచారణ 2017లో 189 రోజులు పడితే, 2021లో కేవలం 42 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్‌ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, చార్జిషీటులో వేగం పెరిగిందని వివరించారు. ‘దిశ’ను చాలా సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. పోక్సో కేసుల విచారణకు 10 కోర్టులు పనిచేస్తున్నాయని, డిసెంబరు నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఇప్పుడు 12 కోర్టులు పనిచేస్తున్నాయని అధికారులు చెప్పగా ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించాలని, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఏపీకి సంబంధంలేని డ్రగ్స్‌ వ్యవహారంపై ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమీక్షా సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతం సవాంగ్‌, ఆర్థికశాఖ కార్యదర్శి కె.సత్యనారా యణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ.రాజేం ద్రనాథ్‌రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img