Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

దిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత

దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో గాలినాణ్యత దారుణంగా పడిపోయింది. దిల్లీలో శుక్రవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 329గా నమోదైంది. నగరంలో అత్యధికంగా అత్యధికంగా ఆన్‌విహార్‌లో 834గా రికార్డయింది. రోహిణి, రిaల్‌మిల్‌, సోనియా విహార్‌లో గాలి నాణ్యత పేలవమైన స్థాయికి చేరుకుంది. ఇక ఈ ప్రాంత పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా గాలి నాణ్యత పడిపోయింది.గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img