Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నేటి నుంచి ‘మేమంతా సిద్ధం’

. ఇడుపులపాయ నుంచి జగన్‌ బస్సు యాత్ర
. ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
. రూట్‌మ్యాప్‌ విడుదల చేసిన తలశిల రఘురామ్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈనెల 27వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఈ బస్సు యాత్రను నిర్వహిస్తారు. సిద్ధం సభల తరహాగానే ‘మేమంతా సిద్ధం’ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్‌, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. గతంలో సిద్ధం సభలు నిర్వహించిన పార్లమెంటు/జిల్లాలను మినహాయించి, మిగిలిన 21 జిల్లాల్లో సీఎం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ఉదయం వివిధ సంఘాల ప్రతినిధులు, మేధావులతో సీఎం భేటీ అవుతారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కడప జిల్లాలో బస్సు యాత్ర పూర్తయిన వెంటనే, మరుసటిరోజు నిర్వహించే జిల్లా రూట్‌ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తారు. తొలి ‘మేమంతా సిద్ధం’ సభ జరగనున్న ప్రొద్దుటూరులో ఏర్పాట్లను పూర్తి చేశారు. సిద్ధం సభలు తరహాగా సీఎం జగన్‌ కార్యకర్తలు, ప్రజల మధ్యకు వెళ్లేలా వేదిక దగ్గర నుంచి మధ్యలోకి ర్యాంపును ఏర్పాటు చేశారు. ప్రతి సభకు లక్షా 50 వేల నుంచి 2 లక్షల మంది హాజరయ్యేలా వేదికలను నిర్మిస్తున్నారు. ఈ బస్సు యాత్రల్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతల చేరికలు ఉంటాయి. సీఎం జగన్‌ సమక్షంలో వారంతా పార్టీ కండువాలు కప్పుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తేదీ వరకూ దాదాపు 21 రోజులపాటు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం జగన్‌ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతారు. ఈ బస్సు యాత్ర మధ్యలోనే వైసీపీ మేనిఫెస్టో విడుదలకు పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img