Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పంజాబ్‌ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఫిబ్రవరి 20న పోలింగ్‌

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త పోలింగ్‌ తేదీని ఈసీ ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20 తేదీన ఒకే దశలో జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజులపాటు వాయిదా వేసింది. తాజాగా ఈ ఎన్నికలను ఫిబ్రవరి 20న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఎక్కువశాతం పంజాబ్‌ సిక్కులు వారణాసికి ప్రయాణిస్తారని, ఈ నేపథ్యంలో 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సీఎం చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పంజాబ్‌ సీఎంతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ కూడా ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని కోరాయి. 117 స్థానాలకు సంబంధించిన కొత్త తేదీని ఈసీ ఇవాళ వెల్లడిరచింది. పంజాబ్‌ పార్టీల అభ్యర్థన నేపథ్యంలో ఇవాళ ఎన్నికల సంఘం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img