Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

పెగాసస్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా దీనిపై బదులివ్వాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ భద్రతపై ఏ ఒక్కరూ రాజీపడాలని కోరుకోరని కొందరు ప్రముఖ వ్యక్తులు ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నారని..అయితే సంబంధిత యంత్రాంగం అనుమతితోనే ఇలా చేయాల్సి ఉంటుందని ఆ అథారిటీ కోర్టు ఎదుట అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమస్య ఏముందుని సుప్రీంకోర్టు బెంచ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి దేశం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఎస్జీ పేర్కొన్నారు. నిన్ననే అఫిడవిట్‌ దాఖలు చేశామని.. ఇక, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని.. వివరాలను బహిరంగపరచలేమని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img