Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రణాళికా సంఘం రద్దుకుకారణమేమిటి?

ప్రధాని మోదీకి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్న

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఫెడరలిజం (సమాఖ్యవాదం) అంటే ఏమిటో తెలియదని, రాష్ట్రాలపై వివక్ష చూపుతూ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించాలన్న ‘ఇండియా’ ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కేంద్రప్రభుత్వం ఆచరించే కొన్ని పద్ధతులు, పనుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిరదని శనివారం దిల్లీలో విలేకరులతో మాట్లాడిన రాజా అన్నారు. అన్ని ప్రభుత్వ రంగాల ప్రవేటీకరణను నీతి ఆయోగ్‌ ప్రతిపాదిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు నీతి ఆయోగ్‌ చేసినదేమిటని రాజా ప్రశ్నించారు. ప్రణాళికా సంఘాన్ని (ప్లానింగ్‌ కమిషన్‌) ఎందుకు రద్దు చేశారో ప్రధాని చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ప్లానింగ్‌ కమిషన్‌ రద్దు… నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు ఉన్నప్పుడు నీతి ఆయోగ్‌ చేసే పని ఏమిటి? ఎటువంటి విధానాలను నిర్ణయిస్తోంది? ప్రభుత్వాన్ని ఎలాంటి సిఫార్సులు చేయబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. నాకు తెలిసి అన్ని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నీతి ఆయోగ్‌ ప్రతిపాదిస్తోంది. అందుకోసమే చాలా మంది ముఖ్యమంత్రులు వాస్తవ సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఆందోళన చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని ముఖ్యమంత్రులు అకారణంగా బహిష్కరించలేదు. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ న్యాయమైనవే. కేంద్రప్రభుత్వ చర్యలే వారి ఈ నిర్ణయానికి కారణం’ అని రాజా అన్నారు. ‘భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం సమానంగా చూడాలి, పన్నులు, నిధుల్లో సముచిత వాటా ఇవ్వాలి కానీ సర్కార్‌ అలా చేయడంలేదు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది. వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కొన్ని రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోంది. వారి గళాన్ని గౌరవించడం లేదు. వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని రాజా విమర్శించారు. సహకార సమాఖ్యవాదం (కోఆపరేటివ్‌ ఫెడరలిజం) గురించి మోదీ మాట్లాడతారు కానీ ఫెడరలిజానికి అర్థం ఆయనకు తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సయోధ్య ఏది? ఫెడరలిజం ఎక్కడ? అది రాజాకీయం మాత్రమే కాదు ఆర్థికపరమైనది కూడా…. ఫెడరల్‌ వ్యవస్థలో కీలక అంతర్భాగం. మోదీకి ఇవేమీ పట్టవు’ అని రాజా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img