Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రైవేటీకరణ పరిష్కారం కాదు

పాలన, నిబంధనలు మెరుగుపరచాలి
విద్య, వైద్యాన్ని పట్టించుకోని పాలకులు
కేంద్రం విధానాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌

న్యూదిల్లీ : దేశాభివృద్ధిలో బ్యాంకులు సహా ప్రభుత్వరంగ సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని, వాటి అవసరం చాలా ఉందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో కలిగే ప్రయోజనాలను మెరుగైన పాలనతోనూ పొందవచ్చని ఆయన స్పష్టంచేశారు. నూతన ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన అంశంపై రాజన్‌ మాట్లాడారు. భారత్‌ టెలికాం విప్లవ రూపకర్త శామ్‌ పిట్రోడా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ పాల్గొన్నారు. ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ అడిగిన ప్రశ్నకు త్యాగరాజన్‌ సమాధానమిసూ…తమ ప్రభుత్వం ప్రైవేట్‌ రంగం, సహకారరంగాల పాత్రను పునరుద్ఘాటిస్తోందని, అయితే రహదారులు, మౌలికసదుపాయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యత ప్రభుత్వాలకే ఉండాలని స్పష్టంచేశారు. తమకు మూలధనం అవసరమని, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉమ్మడి భాగస్వామ్య వ్యాపారాలు కూడా కావాలని చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ సహకారంతో నడిచే సంస్థలు సమర్థవంతంగా ఉంటాయని, కానీ వ్యూహాత్మక ఆస్తుల మానిటైజేషన్‌కు తమ ప్రభుత్వం వ్యతిరేకమని తేల్చిచెప్పారు. విమానాశ్రయాలు, పోర్టులు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా నగదు సేకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ప్రధానికి లేఖ రాసినట్లు త్యాగరాజన్‌ తెలిపారు.
రాజన్‌ మాట్లాడుతూ అన్ని రంగాలు స్పష్టమైన పాత్రలు పోషిస్తాయని అంగీకరించారు. ప్రభుత్వం విభిన్న లక్ష్యాలు కలిగి ఉందని, గుత్తాధిపత్యాన్ని నిరోధించుకోవడానికి తగిన పోటీ ఉందని నిర్థారించుకోవాలని అన్నారు. తగిన నియంత్రణ లేకుండా అధీకృత రంగాన్ని ప్రైవేట్‌ రంగానికి ఇస్తే…ప్రైవేట్‌ సెక్టార్‌ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుందని, దీంతో ప్రైవేట్‌రంగం ఆ సంస్థలను ప్రజలకి దూరం చేసే ప్రమాదం ఉందని రాజన్‌ హెచ్చరించారు. ప్రైవేట్‌ వ్యక్తులకు పూర్తిగా విక్రయించడానికి బదులుగా ప్రభుత్వం తన భాగాన్ని తగ్గించుకోవచ్చన్న శామ్‌ పిట్రోడా సూచనను రాజన్‌ అంగీకరించారు. పాలనను మెరుగుపరచడంపై ఎందుకు దృష్టి పెట్టకూడదని రాజన్‌ ప్రశ్నించారు. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ప్రైవేటీకరించవచ్చని, వాటాలను ప్రజలకు విక్రయించవచ్చని, ఉదాహరణకు ఐసీఐసీఐ ఒక ప్రైవేట్‌ సంస్థగా మారిందని, కానీ ప్రభుత్వ బ్యాంకు కంటే ఎక్కువని రాజన్‌ అన్నారు. బ్యాంకింగ్‌లోనూ ప్రైవేట్‌ రంగానికి తగినస్థాయిలో పోటీ ఉందని, అయితే వాటికి ప్రతిబంధకాలు లేదా ప్రత్యేకత కల్పించేందుకు ప్రభుత్వ రంగం అవసరమని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నామని, ప్రభుత్వరంగ ఆస్తులుగా ఎందుకు ఉంచకూడదో అర్థం కావడం లేదని అన్నారు. ప్రైవేట్‌రంగం దోపిడీ చేయకుండా నిబంధనలు, నియమాలు రూపొందించినట్లు నిర్థారించుకోవాలని రాజన్‌ అన్నారు. మెరుగైన పాలన, మెరుగైన నిబంధనల ద్వారా ప్రైవేటీకరణతో కలిగిన ప్రయోజనాలు పొందవచ్చని రాజన్‌ పునరుద్ఘాటించారు. ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, వ్యయాన్ని తగ్గించారని విమర్శించారు. డబ్బు ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. జీడీపీలో అప్పు 90 శాతానికి పైగా ఉందని, ప్రజలు మరింత పేదరికంలో కూరుకుపోయారనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రజల సామర్థ్యాలను పెంచడానికి, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం నగదు ఖర్చు చేస్తామన్న వాగ్దానాలు ఉన్నాయని, అయితే పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని రాజన్‌ పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే పరిస్థితని, తాము ఖర్చు చేయబోమని చెప్పడం సరికాదని, అవసరమైన చోట ఖర్చు చేయడం ముఖ్యమని రాజన్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img