Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం

రెండ్రోజులు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిరది. ఈ కారణంగా సోమవారం చెన్నై నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావారణ కేంద్రం వెల్లడిరచింది. సెంట్రల్‌ పశ్చిమ దిశగా ఏర్పడివున్న ఈ వాయుగుండం ప్రస్తుతం చెన్నైకు 670 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన చిన్న చిన్న అల్పపీడనాలన్నీ కలిసి వాయుగుండంగా మారాయి. ఇది చెన్నైకు 670 కి.మీ, కారైక్కాల్‌ ప్రాంతానికి 630 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు రానున్న 48 గంటల్లో పయనించే అవకాశం ఉంది. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులో సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా చెన్నై నగరంలో భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, కోస్తాంధ్ర తీరం, తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం, శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల వచ్చే 24 గంటల పాటు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని వాతావారణ కేంద్ర అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img