Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మోదీజీ…కరుణించండి

. తొమ్మిదేళ్లుగా పెండిరగ్‌లో విభజన సమస్యలు
. ప్రధానితో గంటకుపైగా సీఎం జగన్‌ భేటీ
. అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతోనూ చర్చ
. ప్రస్తావనకు నోచుకోని విశాఖ ఉక్కు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తొమ్మిదేళ్లు దాటినా విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, మీరే చొరవ చూపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుధవారం సీఎం దిల్లీ పర్యటన జరిగినట్లు, విభజన అంశాలపైనే ప్రధానితోనూ, హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వరుసగా చర్చించినట్లు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇచ్చిన వినతిపత్రమే మరొకసారి అందజేయడం గమనార్హం. అయితే దీనిలో అత్యంత కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కనీసం ప్రస్తావనకు నోచుకోలేదు. తొలుత అమిత్‌షాతో 45 నిమిషాల పాటు జగన్‌ భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాలసేపు భేటీ కొనసాగింది. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరమని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ప్రధాని దృష్టికి తెచ్చారు. తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లో నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్లని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.1310.15 కోట్లను వెంటనే ఇవ్వాలని కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలు రూ.7,230.14 కోట్లు ఏపీకి రావల్సి ఉన్నాయని, వీటిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిందని, రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, దీనిపై సత్వరమే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా సహా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలు చేపట్టామని, ఈ కాలేజీలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని ప్రధానిని అభ్యర్థించారు. వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం హామీ ఇచ్చిందని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రాజెక్టు కీలకమని దాని ప్రాధాన్యతను వివరించారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండిరగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయడంతో పాటు మొత్తం ఏడు కీలక అంశాలను సీఎం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్‌ వరుస భేటీలను ఒక్కరోజులోనే పూర్తి చేయడం విశేషం. ఉదయం 9 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి దిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్‌…తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో 40 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధానితో గంటా 20 నిమిషాలు, ఆర్థికమంత్రితో భేటీ అనంతరం రాత్రికి వెనుతిరిగారు. అయితే ఈ భేటీలో రాష్ట్ర సమస్యలపైనే చర్చించినట్లు అధికారిక ప్రకటన విడుదలైనప్పటికీ అంతర్గత చర్చలు మాత్రం ముందస్తు ఎన్నికలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, వివేకా హత్య కేసు పరిణామాలు వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img