Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఎం ప్రయాణిస్తున్న విమానానికి
సాంకేతిక లోపం

. 24 నిముషాల్లో గన్నవరంలో ల్యాండిరగ్‌
. విచారణకు ఆదేశించిన భద్రతావర్గాలు
. మరో విమానంలో దిల్లీకి జగన్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: దిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెళ్తున్న ప్రత్యేక విమానంలో సాంకే తిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్‌లో లీకేజీ కార ణంగా ప్రైజరైజేషన్‌ సమస్య నెలకొందని పైలట్‌ ప్రాథమికంగా గుర్తించినట్టుగా అధికారులు తెలి పారు. సమస్యను గుర్తించిన పైలట్‌ విమానాన్ని తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. దిల్లీ పర్యటన కోసం సీఎం జగన్‌, అధికారుల బృందంతో ఉన్న విమానం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్‌ అయింది. కాసేప టికే పైలట్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్‌ అయింది. కేవలం 24 నిముషాలోనే విమానం వెనక్కి వచ్చింది. ఈ ఘటనపై విచారణకు భద్రతా వర్గాలు ఆదేశించాయి. సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో ఏసీ పనిచేయలేదా?, అసలు సాంకేతిక సమస్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విమానంలో సీఎంతోపాటు ఎంపీ మిథున్‌రెడ్డి, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉన్నారు. వేరొక విమానంలో సీఎం దిల్లీకి వెళ్లేలా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.
అధికారులపై సీఎం ఆగ్రహం
విమానంలో నెలకొన్న సాంకేతిక సమస్యలపై జీఏడీ అధికారులపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ వెళ్లే విమానం కాకుండా, ఈ విడత మరో విమానం రావడం, దానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం, దిల్లీ పర్యటనకు జాప్యంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాంకేతిక లోపాలతోనే సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం వెనుదిరిగిందని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి విమానం బయల్దేరే సమయంలో పూర్తిగా చెక్‌ చేస్తామని, ఆ తర్వాతే విమానం టేకాఫ్‌ అవుతుందని పేర్కొన్నారు. చిన్న సాంకేతిక కారణం వున్నా విమానాన్ని వెనక్కి తీసుకొస్తారని, సీఎం ప్రయాణిస్తున్న విమానంలోనూ అదే జరిగిందని వివరణిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img