Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీట్ల సర్దుబాటుపై కమిటీ

. సభ్యులుగా రాజా, నారాయణ, పాండా
. 16న సమ్మె, గ్రామీణ బంద్‌కు సంపూర్ణ మద్దతు
. సీపీఐ జాతీయ సమితి తీర్మానాలు

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ‘ఇండియా’ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సీపీఐ జాతీయ సమితి సమావేశం నియమించింది. కమిటీ సభ్యులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, రామ కృష్ణ పాండాలను ఎంపిక చేసింది. కేంద్ర కార్మిక, సంయుక్త కిసాన్‌ మోర్చా నెల 16న చేపట్టిన సమ్మె, గ్రామీణ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి జాతీయ సమితి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చింది. కార్మిక, రైతు, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు ప్రస్తావించకుండా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ బీకే కాంగో ప్రవేశపెట్టిన మరో తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ట పాండా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ సమితి సభ్యులు నిషా సిద్దు, జాతీయ కార్యవర్గ సభ్యులు, కూనంనేని సాంబశివ రావు హాజరవ్వగా దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై డి.రాజా నివేదిక సమర్పించారు. సీపీఐ జాతీయ సమితి అనేక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
కేంద్ర బడ్జెట్‌ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, అసమానతలు తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీపీఐ జాతీయ సమితి విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది. దేశాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటానికి ప్రజాస్వామ్య, లౌకికశక్తులు మద్దతుగా నిలవాలని కోరింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో (2014- 2022 వరకు) 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. కార్మికుల వేతనాలు పెరిగాయని కేంద్రం చెప్పడం అబద్ధమని, దేశంలో అత్యంత ప్రధాన నిరుద్యోగ సమస్యను బడ్జెట్‌ ప్రస్తావించలేదని విమర్శించింది.
ప్రజల జీవితాలు, జీవనోపాధిపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దాడులు కొనసాగిస్తోందని, వివిధ చట్టాలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, విధాన పరమైన డ్రైవ్‌ ద్వారా కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యలను దూకుడుగా కొనసాగిస్తోందని ఆరోపించింది. ప్రజలచేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తోందని, అసమ్మతి స్వరాలను అణిచివేస్తోందని దుయ్యబట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని, రాజ్యాంగ సంస్థలను వర్గీకరించే ప్రమాదకరమైన క్రీడ కొనసాగుతోందని తెలిపింది. మీడియా, జర్నలిస్టుల స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేరస్తులను రక్షిస్తోందని విమర్శించింది. విద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయని, 2014-15లో మొత్తం బడ్జెట్‌ రూ.1.85 శాతం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.33 శాతానికి పడిపోయిందని వివరించింది. నిరుద్యోగ రేటు 8.7 (సీఎంఐఈ) ఉండగా, మహిళల కార్మిక భాగస్వామ్య రేటు కూడా చాలా తక్కువగా నమోదైందని, దాదాపు 60 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతు న్నారని, ఉద్యోగ మార్కెట్‌ పడిపోయిందని తెలి పింది. సీపీఐ జాతీయ సమితి తీర్మానాలను కె.నారాయణ, బాలచంద్ర కాంగోతో కలిసి హైదరాబాద్‌ మఖ్దుంభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్‌జిత్‌ కౌర్‌ వెల్లడిరచారు. కార్మిక, రైతు, ఉద్యోగ, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలతో భారతదేశం ప్రమాదంలో పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పదేళ్ల పాలనలో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సోషలిజం ప్రాథమిక సూత్రాలను కాపాడేందుకు జరుగుతున్న పోరాటంలో అందరూ ముందుకు రావాలన్నారు. పాలకులకు తగిన గుణపాఠం తప్పదని రైతు, కార్మిక పోరాటాల ద్వారా నిరూపణ జరిగిందన్నారు.
కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజనం కలిగించేం దుకుగాను 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మోదీ సర్కారు తీసుకొచ్చిందని, ఇది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమని, ఇది వృత్తిపరమైన భద్రతకు నష్టదాయకమని, పనిదినాలను 8 నుండి 12 గంటలకు పెంచే ప్రతిపాదన ఇందులో ఉందని అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ హక్కులు కాపాడుకునేందుకు కార్మికులు, రైతులు పరస్పర మద్దతుగా ఐక్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో రైతు, కార్మిక సంఘాలు సంయుక్తగా సమావేశమవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమమని, మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలు చేపట్టేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నవంబర్‌ 26, 27, 28 తేదీల్లో రాజ్‌భవన్‌ల ముందు ఆందోళనలు చేసినట్లు గుర్తుచేశారు. న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవాలని కోరారు. బీజేపీది తుకుడే గ్యాంగ్‌ అని విమర్శించారు. కార్మిలకుకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని అమర్‌జిత్‌ కౌర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img