Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నాటుసారా తయారీ భట్టి పై దాడులు

నిజాంపట్నం : నాటుసారా తయారీ చేసే భట్టి పై దాడులు చేశామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నగరం సిఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు.గురువారం అయాన మాట్లాడుతూ నిజాంపట్నం మండలంలోని కళ్ళిఫలం గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారంతో భట్టిపై దాడి చేసి 150 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 4 లీటర్ల నాటుసారాను సీజ్‌ చేశామన్నారు.నాటుసారా తయారీ చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్‌ పంపించామన్నారు.నాటుసారా తయారు చేసేందుకు దానిలో అనేక రకాల విష పదార్థాలను ఇష్టం వచ్చినట్లు కలిపి తయారు చేస్తారని దానిని ప్రజలు సేవించడం ద్వారా శరీరంలోని ముఖ్య అవయవాలన్నీ పాడై అనారోగ్యానికి గురవుతారని చెప్పారు.తీర ప్రాంతంలో ఎవరైనా నాటుసారా తయాడం, విక్రయాలు జరపడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని అట్టి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.ఈ దాడుల్లో నగరం సెబ్‌ ఎస్‌ఐ రవికుమార్‌ , సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img