Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

పోలవరం నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి – సిపిఐ డిమాండ్‌

రేపల్ల్లె – పోలవరం ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి నిర్వాసితులకు తక్షణమే న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ఆందోళనలకు సంఫీుబావంగా సిపిఐ రాష్ట్ర సమితి నిచ్చిన పిలుపు మేరకు గురువారం సిపిఐ ఆద్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కన్నెగంటి రమేష్‌ బాబు, ఏఐటియూసి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి. నాగాంజనేయులు మాట్లాడుతూ 2019 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోనికి వస్తే పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చిన బిజేపి ప్రభుత్వం హామీల అమలులో విఫలమయ్యాందని ఆరోపించారు. పోలవరం ముంపుకు గురి అవుతున్న బాదితులను ఆదుకోవటంలో కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు శూన్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన వ్యవసాయ నల్లా చట్టాలను రద్దు చేయాలని డిల్లీ సరిహద్దుల్లో వేలాధి మంది రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వ్యవసాయ నల్లా చట్లాలను రద్దు చేయాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చెయ్యాలని లేకుంటే తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రేపల్ల్లె ఏరియా కార్యదర్శి జి. బాలాజీ, నాయకులు జాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img