Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రాజధాని పాదయాత్రకు జన నీరాజనం

విశాలాంధ్ర`తాడికొండ : రెండవ విడత రైతులు చేపట్టిన రాజధాని పాదయాత్రకు జనం నీరాజనాలు పట్టారు. రాజధానినీ అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన రెండో విడత పాదయాత్ర సోమవారం వెంకటపాలెం నుంచి ప్రారంభమైంది. తొలుత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలందుకున్న అనంతరం పాదయాత్ర సాగింది. రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్రకు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, మంగళగిరి గ్రామస్తులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. వైసీపీ మినహా అన్ని పార్టీలకు చెందిన నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు సంఫీుభావం ప్రకటించారు. ముందుండి నడిపించారు. జై అమరావతి జై జై అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ మహిళలు చేసిన నినాదాలు హోరెత్తించాయి. కుల, మత, పార్టీలకతీతంగా గ్రామాలలో రైతులకు పూలతో ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, గుంటూరు నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, గుంటూరు నగరానికి చెందిన పలువురు నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, అమరావతి జేఏసీ నాయకులు డాక్టర్‌ రాయపాటి శైలజ, శివారెడ్డి, కొలికపూడి శ్రీనివాసరావు, చందోలు శోభారాణి, కంభంపాటి శిరీష, అధిక సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img