Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రంలో దళితులకు మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది

  • డాక్టర్ అచ్చన్న మృతిపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
  • రాష్ట్రంలో దళితులకు మైనారిటీలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
  • చలో విజయవాడకు వెళ్లకుండా సిపిఐ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గం
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ

రాష్ట్రంలో దళితులకు మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.మంగళవారం సిపిఐ
ఛలో విజయవాడ కార్యక్రమం పిలుపు నిచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలోని కె. రామకృష్ణ తన నివాసం నుండి సిపిఐ నేతలతో కలిసి
కొంత దూరం ర్యాలీగా విజయవాడ బయలుదేరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో (కడపలో) ఓ జిల్లా స్థాయి అధికారిని దారుణంగా కిడ్నప్ చేసి చంపడం దుర్మార్గం అని అన్నారు.ఆ ఘటన పై ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.సియం కనీసం వారి కుటుంబాన్ని ఫోన్ లో కూడా పరామర్శించలేదని అన్నారు.
కనీసం పంచానామ, పోస్ట్ మార్టం చేసే టప్పుడు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు.గతంలో సుధాకర్ విషయంలో ఇదే జరిగిందని
ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని హత్య చేసి డోరు డిలీవరి చేసారని విమర్శించారు.పైగా వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి ఊరేగిస్తున్నారని ఒక దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని మండి పడ్డారు. అలాగే మైనార్టీ కుటుంబాల పైన నంద్యాలలో సలాం కుటుంబంలో హాజీర కుటుంబ విషయంపై వీటన్నిటిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. ప్రత్యేకించి డాక్టర్ అచ్చన్న మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రంలో దళితులకు మైనార్టీలకురక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.పోలీసులు కడపలో అనంతపురంలో చాలామంది సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.జాతీయ రాజకీయ పార్టీల కు హోదా ఉప సంహరణపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు.రాజకీయాల్లో ఒక చరిత్ర కలిగిన పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.ఎన్నికల కమిషన్ వెనుక రాజకీయాల ఒత్తిడి ఉండి ఉండొచ్చు అన్నారు.అంత తొందరపాటు చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.రాబోయే ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు.పోరాడే పార్టీలకు ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడే మేము చేయాల్సిన పనులు చేశామని అన్నారు.గతంలో పోరాడి ఆస్తులు పోగొట్టుకున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శులు తుడిమెల్ల వెంకటయ్య,ముసునూరు సుహాస్, మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, చిన్ని సత్యనారాయణ,జవ్వాది సాంబశివరావు,బుర్ల శ్రీనివాసరావు,పంతగాని మరియదాసు,గుత్తు నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img