Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ కామినేని భాస్కరరావు

. ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ కామినేని భాస్కరరావు
. నేటి తరానికి ఆదర్శప్రాయుడు భాస్కర్ రావు
. కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది.
. ప్రపంచం దేశం సమాజం మారాలి
. పేద ధనిక వర్గాల తారతమ్యం పోవాలి
. పేదవాడి రాజ్యం రావాలన్న కష్టజీవులకు పెద్దపీట వేయాలన్న కమ్యూనిస్టులకే సాధ్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ

. రాష్ట్రంలో అత్యంత అప్రజా స్వామిక పాలన సాగుతోంది
. ఓట్ల కోసం కట్టే ఇల్లు కాకుండా నివాసయోగ్యమైన ఇల్లు కట్టాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు

విశాలాంధ్ర – మంగళగిరి – దుగ్గిరాల : నేటి తరానికి ఆదర్శ ప్రాయుడు కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కె.రామకృష్ణ అన్నారు.బుధవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు సంస్మరణ సభ వారి నివాసం వద్ద సిపిఐ నియోజకవర్గ నాయకులు పఠాన్ రషీద్ ఖాన్ అధ్యక్షతన జరిగింది.
ముందుగా కామ్రేడ్ కామినేని భాస్కరరావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి కే. రామకృష్ణ,రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ కామినేని భాస్కరరావు సీపీఐ సీనియర్ నేత అని. 94 సంవత్సరాల వయసు వచ్చే వరకు భారత కమ్యూనిస్టు పార్టీలో ఉంటు అంకితభావంతో పనిచేశారని అన్నారు. స్వాతంత్రం రాకముందే కామ్రేడ్ భాస్కరరావు 1946వ సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారని అన్నారు. 76 సంవత్సరాల పాటు నిర్విరామంగా సిపిఐ పార్టీ లో ఉంటూ పనిచేయడం గొప్ప విషయమని అన్నారు. నేటి యువతరం కామ్రేడ్ కామినేని భాస్కరరావును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.కష్టజీవుల తరఫున పేద ప్రజల తరఫున అణగారిన వర్గాల తరఫున ఎవరైతే పోరాడతారో వారికి ఎప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో స్థానం ఉంటుందని అన్నారు. భాస్కర్ రావు యొక్క త్యాగాలను వారి సుదీర్ఘ పోరాటాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందనిమండిపడ్డారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ వారి ఆస్తులను పెంచడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కష్టజీవులంతా సమైక్య పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవైపు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని
తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలు రైతులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కష్టజీవులంతా సమైక్య పోరాటానికి సిద్ధమవుతున్నారని అన్నారు. అదేవిధంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్టులు అదేవిధంగా లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నీ కూడా ఓకే వేదికపై రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ దేశంలో దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అట్టడుగు వర్గాల ప్రజలకు అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం కోసం ముందుకు వెళ్తామని అన్నారు.ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ప్రపంచం,దేశం, సమాజం
మారాలని పేద ధనిక వర్గాల తారతమ్యం పోవాలని సమ సమాజ పురోభివృద్ధి జరగాలని అన్నారు.పేదవాడి రాజ్యం రావాలంటే కష్టజీవులకు పెద్దపీట వేయాలంటే అది కమ్యూనిస్టు పార్టీకే సాధ్యమని అన్నారు. కామ్రేడ్ కామినేని భాస్కరరావు సంస్మరణ సభ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితితరపునఘనంగానివాళులర్పిస్తున్నా మన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు విజయవాడలో జాతీయ మహాసభలు లక్షలాదిమంది ప్రజలతో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అత్యంత అప్రజాస్వామ్యక పాలన కొనసాగుతుందని అన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని రాష్ట్రంలో తన బెయిల్ రద్దు కాకుండా కేసు వేగంగా విచారణకు రాకుండా కాపాడుకోవడం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూర్చున్నారనిఅన్నారు.పేదలందరికీ పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నివాసయోగ్యమైన ఇల్లు కట్టించమని చెప్పామన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలంలో కేంద్రం ఇచ్చిన 1,80,000 తో సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇళ్ల స్థలం ఇచ్చిన 35 లక్షల మందికి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున కేటాయించి ఆ సెంటు స్థలాన్ని మూడు సెంట్లు చేసే సౌకర్యమంతమైన ఇల్లు నిర్మాణానికి తోడ్పడాలని ఓట్ల కోసం కట్టే ఇల్లు కాకుండా నివాసయోగ్యమైన ఇల్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు స్వాతంత్య్ర పూర్వం 1946 నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా మొదలై తన తుదిశ్వాస
విడిచేంతవరకూ పార్టీలోనే కొనసాగారని అన్నారు.
తుమ్మపూడి గ్రామ స్థాయి నుండి తెనాలి తాలూకాలో జరిగిన అనేక పోరాటాలలో చురుకైన పాత్ర పోషించి క్రమశిక్షణ కలిగిన
కమ్యూనిస్టు కార్యకర్తగా నాయకుడిగా గుర్తింపు పొందారని
అన్నారు.గ్రామంలో జరిగిన భూ పోరాటం గ్రామ పెత్తందారుల కబంధ హస్తాల క్రింద వున్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద
రైతులకు పంచిన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు చనిపోయే నాలుగు రోజులు ముందు పార్టీ నాయకత్వాన్ని
ఇంటికి పిలిపించుకొని ఆనందంగా చనిపోయినటువంటి వర్గబంధపు ప్రతీక కామ్రేడ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు,
నియోజకవర్గ సీపీఐ నాయకులు జాలాది జాన్ బాబు, మంగళగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రమేశ్వరరావు,
ఇప్తా జాతీయ కార్యదర్శి గని,
ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర నాయకులు. వీరాంజనేయులు.ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు,ప్రజానాట్యమండలి
గుంటూరు నగర కార్యదర్శి సిహెచ్ పుల్లయ్య, గౌడ్ సంఘం అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శివయ్య,
ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ , ప్రజానాట్యమండలి తెనాలి నాయకులు బోల్లి ముంత కృష్ణ , జవ్వాది సాంబశివరావు గుంటక సాంబీరెడ్డి, ముసునూర్ సుహాస్,తుడి మెల్ల వెంకటయ్య,కరిముల్లా తుమ్మపూడి గ్రామ సీపీఐ కార్యదర్శి షేక్ కరీముల్లా,సిపిఎం మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, సిపిఎం మండల నాయకులు వల్లభనేని సాంబశివరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు,బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img