Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పాలు పోసే వారే యజమానులు

విశాలాంధ్ర`ఈపూరు : లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప సంస్థ అమూల్‌ అని కొచ్చర్ల సర్పంచ్‌ కోపల దేవరాజు అన్నారు. మండలంలోని కొచ్చర్ల గ్రామంలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో పాల్గొన్న సర్పంచి దేవరాజు మాట్లాడుతూ అమూల్‌ అనేది కంపెనీ కాదని సహకార సంస్థ అని, అమూల్‌ లాభాపేక్ష లేని సంస్థ అని, ఇక్కడ పాలు పోసే రైతులే యజమానులని వచ్చే లాభాలను పాడి రైతులకే తిరిగి ఇస్తారన్నారు. పాల ఉత్పత్తిదారులకు అన్యాయం జరుగుతుందని, ఈ పరిస్థితిని మార్చడానికే వైసీపీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. అమూల్‌ సంస్థ పాల బిల్లులను 10 రోజుల్లోనే పాడిరైతుల ఖాతాల్లోకి జమచేస్తోందని, దీనివల్ల ఆర్థికంగా అక్కచెల్లెమ్మలకు మరింత మంచి జరుగుతుందన్నారు. సహకార రంగ వ్యవస్థ బాగుంటేనే రైతులు బాగుంటారన్నారని, ప్రతి గ్రామంలోనూ మహిళా డెయిరీ సహకార సంఘాల ద్వారా మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పాల సేకరణ సొసైటీలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అమూల్‌ ప్రాజెక్ట్‌ చేపట్టడం జరిగిందన్నారు. కోపరేటివ్‌ స్ట్రక్చర్‌లో ఈ సొసైటీలు పని చేస్తాయని, జగనన్న ప్రభుత్వం సొసైటీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పాల సేకరణ భవనాలు, అవసరమైన పరికరాలు ఇస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న పాల వెల్లువతో మహిళలకు సుస్థిర, శాశ్వత ఆదాయమార్గాలు ఏర్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఎం.హిమబిందు, వైస్‌ ఎంపీపీ గోలి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు గోలి ఏడుకొండలు, జాగర్లమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img