Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విశాలాంధ్ర`బొల్లాపల్లి : మండలంలోని గరికపాడు గ్రామంలో అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణలో రిటైర్డ్‌ టీచర్‌ కీర్తిశేషులు రాయబారం జాన్‌(రిటైర్డ్‌), మరియమ్మ(రిటైర్డ్‌), రాయబారం శామ్యూల్‌(రిటైర్డ్‌), సౌరీలు(రిటైర్డ్‌) జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. హ్యాండ్‌ ఆఫ్‌ హోప్‌, జాయిస్‌ మేయర్‌ మినిస్ట్రీస్‌ వారు సంయుక్తంగా డాక్టర్‌ కె.జవహర్‌ కెనడి డాక్టర్స్‌ టీం సాయంత్రం వరకు ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎక్సరే, దంత పరీక్షలు, ఉచిత మందులు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సయ్యద్‌ జఫ్రుల్లా ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు రాయబారం వందనం, శ్యారమ్మ, మాచర్ల పీటర్‌ పాల్‌, శీలయ్య, అంగనవాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img