Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కరోనా థర్డ్‌ వేవ్‌ షురూ

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ హెచ్చరిక
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో…కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రారంభదశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గురువారం హెచ్చరించారు. జెనీవాలో అథనామ్‌ మాట్లాడుతూ..కరోనా వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతోందని, మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందన్నారు. డెల్టా వేరియంట్‌ 111 దేశాల్లో నమోదైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్‌ మరింతగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్‌ ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలలో ఇంకా కరోనాపై సామాజిక చైతన్యం, ప్రజారోగ్య రక్షణ చర్యలపై నిర్దిష్ట విధానాలు లేకపోవడం, టీకాల కార్యక్రమం నత్తనడకన సాగడం వంటి ఇబ్బందులు కేసులు, మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమన్నారు. 10 వారాల క్షీణత తరువాత మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో నాలుగోవంతు మందికి మాత్రమే కరోనా టీకాల మొదటి డోసు అందింది. టీకాల పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, సంపన్నదేశాలు ఎక్కువ టీకాలు పొందాయాని అథనామ్‌ వెల్లడిరచారు. టీకాలలో అసమానత కారణంగా ప్రపంచానికి కరోనా ముప్పు తప్పేలా లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img