Monday, August 15, 2022
Monday, August 15, 2022

చైనారష్యా స్నేహానికి 20ఏళ్లు

బీజింగ్‌: చైనారష్యా సంబంధాలు 20 ఏళ్లలో అనేక కీలక సవాళ్లను, నష్టాలను తట్టుకుని చారిత్రక స్థాయికి చేరుకున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి పేర్కొన్నారు. చైనారష్యాల స్నేహపూర్వక సహకార 20వ వార్షికోత్సవం సందర్బంగా రాజధాని బీజింగ్‌లో జరిగిన సమావేశానికి వాంగ్‌యి హాజరయ్యారు. రెండు దేశాలు పరస్పర సహకారం, విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన సూచించారు. ఆచరణాత్మక సహకారాన్ని సాంస్కృతిక మార్పిడితో వ్యూహాత్మక సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. 20 ఏళ్లలో చైనారష్యాలు ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదలను నమోదు చేశాయన్న వాంగ్‌యి…భవిష్యత్తులో నూతన దశకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చైనాలోని రష్యా రాయబారి ఆండ్రీ డెనిసోవ్‌ మాట్లాడుతూ.. జూన్‌లో రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటనను జారీ చేసి ఈ ఒప్పందాన్ని పొడిగించాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సహకారం కోసం మరింత ప్రతిష్టాత్మక అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. నూతన లక్ష్యాలు సాధించడానికి రష్యా తన వంతు కృషి చేయడానికి చైనాతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img