Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

జపాన్‌ తదుపరి ప్రధాని కిషిదా

టోక్యో : జపాన్‌ తదుపరి ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా ఎన్నికవడం ఖాయమైంది. ఈ మేరకు వచ్చే సోమవారం జపాన్‌ పార్లమెంటులో ఎన్నిక జరగనుంది. జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రి అయిన కిషిదా అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గెలుపొందారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యొషిహిదే సుగా స్థానాన్ని కిషిదా భర్తీ చేయనున్నారు. సుగా కేవలం ఏడాదిలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నేత అయిన కిషిదా, భాగస్వామ్య పక్షాల సహకారంతో.. పార్లమెంటులో ప్రధానిగా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తోంది. ప్రస్తుతం వాక్సినేషన్‌ మంత్రిగా పనిచేస్తున్న టారో కోనో ప్రధాని అభ్యర్థిగా పోటీపడినప్పటికీ.. లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఎన్నికల్లో కిషిదానే విజయం వరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img