Friday, March 31, 2023
Friday, March 31, 2023

టెక్సాస్‌లో కాల్పులు` ఒకరి మృతి


టెక్సాస్‌: అమెరికాలో కాల్పుల సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తాజాగా టెక్సాస్‌లో తుపాకీ పేలింది.ఎప్‌ పాసో ప్రాంతంలోని షాపింగ్‌ మాల్‌లో కాల్పులు జరిగాయి. ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్టు చేయగా మరొక అనుమానితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకుగల కారణాలు తెలియలేదు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో మాల్‌లోని ప్రజలంతా బయటకు పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షి వెల్లడిరచారు. గతేడాది మేలోనూ టెక్సాస్‌లో 18 ఏళ్ల యువకుడు ఓ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు జరిపి మారణహోమం సృష్టించాడు. 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే ఈమధ్యనే మిచిగాన్‌ యూనివర్సిటీలో ఓ దుండగుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగురిని చంపేశాడు. ఈ ఘటనలో గాయపడిన కొందరు ఇంకా కోలుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img