Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

రష్యా`జర్మన్‌ మధ్య సహకారం : పుతిన్‌

మాస్కో : అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రష్యా, జర్మనీల మధ్య సహకారం, ప్రాముఖ్యతలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నొక్కి చెప్పారు. జర్మనీ ఐక్యతా దినోత్సవం సందర్బంగా జర్మనీ ఛాన్స లర్‌ మెర్కెల్‌కు పుతిన్‌ అభినందన సందేశం పంపారు. జర్మన్‌ పునరేకీకరణ చారిత్రాత్మక సంఘటనగా పుతిన్‌ పేర్కొన్నారు. దీనితో మాస్కో, బెర్లిన్‌ల మధ్య సంబంధాలలో నూతన దశ ప్రారంభమైందన్నారు. వివిధరంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు, రష్యా, జర్మన్‌ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు పుతిన్‌ తన విశ్వా సాన్ని వ్యక్తం చేశారు. 1990 నుంచి అక్టోబరు 3న, జర్మన్‌ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.. 31 సంవత్సరాల క్రితం ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌జర్మనీ, జర్మన్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ పునరేకీకరణ జరిగింది. ఆగస్టు చివరిలో మెర్కెల్‌ మాస్కోలో పుతిన్‌తో సమావేశ మయ్యారు. ఈ సందర్బంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ ఎజెండాలపై చర్చలు జరిపారు. ఆఫ్గాన్‌, ఉక్రెయిన్‌, లిబియా, సిరియాలో పరిస్థితులు, బెలారస్‌తో సంబంధాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img