Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శ్రీలంకలో టీచర్ల సమ్మె ఉధృతం


కొలంబో : కరోనా మహమ్మారి వేళ యూనియన్‌ నాయకులను నిర్బంధించడాన్ని నిరసిస్తూ శ్రీలంక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు. దీంతో సోమవారం ఆన్‌లైన్‌ బోధనలు నిలిపివేశారు. సమ్మెలో 2.42 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 16వేల మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారని టీచర్స్‌ యూనియన్‌ నాయకుడు ప్రియాంత ఫెర్నాండో తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా యూనియన్‌ నాయకులు దేశవ్యాప్త నిరసన చేపట్టారు. 23ఏళ్లుగా జీత భత్యాల విషయంలో తగిన పరిష్కారం సూచించకపోవడాన్ని టీచర్లు నిరసించారు. గతవారం చేపట్టిన నిరసనల సమయంలో ముగ్గురు యూనియన్‌ నాయకులతోపాటు అనేకమందిని ప్రభుత్వం అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు పదకొండు విద్యా, కార్మిక సంఘాలు నిరసన ప్రకటించాయి. బెయిల్‌పై విడుదలై కోర్టు నుంచి బయటకు వెళ్తుండగా నాయకులను, ఇతర నిరసనకారులను వాహనాలలో నెట్టి నిర్బంధ కేంద్రాలకు తీసుకెళ్లారు. శాంతియుత నిరసనల హక్కులను ఉల్లంఘిస్తున్నారని బార్‌ అసోసియేషన్‌ పోలీసు చీఫ్‌కు లేఖ రాసింది. నిరసనకారులు నిబంధనలు ఉల్లంఘించారని, భవిష్యత్తులో ఉల్లంఘించినవారిని పోలీసులు అరెస్టు చేస్తూనే ఉంటారని హోంమంత్రి వరత్‌ వీరశేఖర పార్లమెంటులో వెల్లడిరచారు. ఆన్‌లైన్‌ బోధనలకు 4.3 మిలియన్ల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img