Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అంతర్జాతీయ టీకా సహకారం కోసం చైనా పిలుపు

బీజింగ్‌ : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌`19 నియంత్రణ టీకాల న్యాయమైన, సహేతుకమైన పంపిణీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం చివరినాటికి ప్రపంచానికి రెండు బిలియన్‌ వాక్సిన్లను, కోవాక్స్‌ కార్యక్రమానికి 125 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందించేందుకు చైనా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణకు ప్రపంచ జనాభాలో 70శాతం మందికి పూర్తిస్థాయిలో టీకాలు వేసేందుకు 11 బిలియన్‌ మోతాదులు అవసరమని అంచనా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2021 చివరి నాటికి ఈ సంఖ్య 6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తక్కువ ఆదాయ దేశాలలో 1 శాతం మందికి మాత్రమే కనీస ఒక మోతాదు టీకా ఇవ్వబడిరది. అంతర్జాతీయ కోవాక్స్‌ వ్యవస్థ తన జనాభాకు తగినంత వాక్సిన్లను అందించడంలో విఫలమవుతోందని తదుపరి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆఫ్రికన్‌ యూనియన్‌ తెలిపింది.
కరోనా మహమ్మారి నియంత్రణకుగాను కీలకమైన టీకాల కార్యక్రమాన్ని చైనా తన బాధ్యతను నెరవేర్చడంతోపాటు 100కిపైగా దేశాలకు వాక్సిన్‌లను పంపిణీ చేస్తోంది. 60కిపైగా దేశాలకు వాక్సిన్లను ఎగుమతి చేస్తోంది. మొత్తం 770 మిలియన్‌ డోస్‌లకు మించి ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉంది. అభివృద్ధి చెందుతన్న దేశాలలో వాక్సిన్‌ను సరసమైన ధరలకు చైనా సహకరించిందని జిన్‌పింగ్‌ తెలిపారు. టీకాల పరిశోధనలో టీకాల అభివృద్ది, ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమంలో ఇతర దేశాలతో సహకారాన్ని పెంచడానికి చైనా సిద్ధంగా ఉందని అన్నారు. వాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని జిన్‌పింగ్‌ తెలిపారు. వాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం, పంపిణీకి సంబంధించిన సమస్యల పరిష్కారాలను కొనుగొనడం చైనాకు అత్యవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాక్సిన్‌ సహకారాన్ని ప్రోత్సహించడం, మానవత్వానికి భాగస్వామ్య భవిష్యత్తుతో సంఘాన్ని నిర్మించేందుకు మేము అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగాఉన్నామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img