Friday, April 26, 2024
Friday, April 26, 2024

అబేకు తుది వీడ్కోలు

హాజరైన ప్రధాని మోదీ

టోక్యో: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్య క్రియలు మంగళవారం అధికార లాంఛనాలతో ముగిశాయి. షింజో చితా భస్మానికి నిప్పాన్‌ బుడోకన్‌ హాల్‌లో నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అబే కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలు పూర్తి చేసింది. అబేకు నివాళులర్పించడానికి ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షురాలు హాజరయ్యారు. ఇక్కడ వేలమంది అబేకు నివాళులర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని సమర్పించారు. ప్రపంచ దేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకున్న రెండో నేతగా అబే నిలిచారు. అబే మృతికి మోదీ సంతాపం వెలిబుచ్చారు. జూలైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షింజో అబేను ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే. అబే తన పదవీకాలంలో నాలుగుసార్లు భారత్‌ను సందర్శించారు. 2014 జనవరిలో భారత గణ తంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన జపాన్‌ ప్రధా నిగా ఘనతకెక్కారు. షింజో అబేకు రాచరిక రీతిలో ప్రభుత్వ లాంఛనాలతో నివాళి అర్పించేందుకు జరిగిన ఏర్పా ట్లపై ఆ దేశ ప్రజలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. రాచ రిక కుటుంబానికి చెందని షింజోకు ఎందుకు ఆ రీతిలో నివాళి అర్పిస్తున్నారని ప్రశ్నించారు. షింజోకు నివాళిని వ్యతిరేకిస్తూ ఇటీవల ఓ వ్యక్తి పీఎంవో ఆఫీసు ముందు నిప్పు అంటిం చుకున్న విషయం తెలిసిందే. ఆ అంత్యక్రియలను రద్దు చేయాలని వేల మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. అబే అంత్యక్రియల కోసం జపాన్‌ సుమారు 11 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. భారీ మొత్తం వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. ఓ సర్వే ప్రకారం 60 శాతం మంది ప్రజలు అబే వీడ్కోలుకు ప్రభుత్వం చేస్తున్న భారీ ఖర్చును ఖండిరచారు. టోక్యోలోని ఇంటి నుంచి షింజో అబే అస్థికలను .. నిప్పాన్‌ హాల్‌కు తరలించే రూట్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ దేశాధినేతలు అంత్యక్రియలకు హాజరవుతున్న నేపథ్యంలో సుమారు 20వేల మంది పోలీసులతో భద్రతను కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img