Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికా వ్యతిరేకులకు సాయమా? నిక్కీహేలీ


వాషింగ్టన్‌: తానే కనుక అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే… అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ సహాయక నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్‌ నిక్కీ హేలీ ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టారు. ద్వేష వైఖరిని ప్రదర్శించే దేశాలకు ప్రతి రూపాయిని కట్‌ చేస్తానని, అమెరికా ప్రజలు ఎంతో కష్టపడి కూడగట్టిన సంపదను అలాంటి వారికి ఎందుకు దారపోయాలని ఆమె ప్రశ్నించారు. గత ఏడాది అమెరికా 46 బిలియన్‌ డాలర్లు విదేశాలకు సహాయంగా అందించిందని, అందులో చాలా మొత్తం అగ్రరాజ్యాన్ని ద్వేషిస్తున్న దేశాలకు అందుతున్నాయని తెలిసి.. తమ దేశ పన్ను చెల్లింపుదారులు దిగ్భ్రాంతికి గురయ్యారని నిక్కీ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img