Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆహార సంక్షోభంలో శ్రీలంక

కొలంబో: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో 60 లక్షల పైగా ప్రజలు ‘‘ఆహార అభద్రత’’తో ఉన్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ఆందోళన వెలిబుచ్చింది. విదేశీ మారక ద్రవ్యం క్షీణించడంతో శ్రీలంక అల్లాడుతోంది. ద్రవ్యోల్బణం పతాకస్థాయికి చేరింది.60లక్షల మందికిపైగా ఆహారం కోసం అల్లాడుతున్న పరిస్థితి. ఇప్పటివరకు అవసరమైన 63 మిలియన్ల డాలర్ల నిధులలో కేవలం 30 శాతం మాత్రమే పొందింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలోని 30 లక్షల మందికి అత్యవసరంగా పోషకాహారం, పాఠశాలల్లో భోజనం అందించాలని డబ్ల్యుఎఫ్‌పీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాబోయే రెండు నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని డబ్ల్యుఎఫ్‌పీ అందోళన వెలిబుచ్చింది. జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం రేటు 80 శాతంపైగా నమోదుకాగా రానున్న కాలంలో మరింతగాపెరిగే అవకాశం ఉందని డబ్ల్యుఎఫ్‌పీ కంట్రీ డైరెక్టర్‌ సిద్ధిఖీ చెప్పారు. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది, అంటే దాదాపు 5.3 మిలియన్ల మంది ప్రజలు తమ భోజనాల పరిమాణాన్ని తగ్గించడం లేదా భోజనాన్ని దాటవేస్తున్నారు. తద్వారా వారి కుటుంబాల్లోని యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఆహార ధరల ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, వస్తువుల కొరతతో దాదాపు 61 శాతం కుటుంబాలు తాము తినే మొత్తాన్ని తగ్గించుకోవడం, తక్కువ పోషక విలువలున్న భోజనం తీసుకుంటున్నామని ఒక మహిళ ఆవేదన వెలిబుచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img