Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇద్దరు రష్యా కమాండర్ల మృతి

మాస్కో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇద్దరు కీలక కమాండర్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. దొనెట్స్క్‌లో జరిగిన పోరాటంలో కర్నల్‌ వ్యాచెస్లావ్‌ మకరోవ్‌, కర్నల్‌ యెవ్జెనీ బ్రోవ్కో మృతిచెందారని తెలిపింది. వీరు ఎక్కడ మృతిచెందారు, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడిరచలేదు. వీరిలో మకరోవ్‌ రష్యాకు చెందిన నాల్గవ మోటరైజ్డ్‌ రైఫిల్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయనే వ్యక్తిగతంగా యుద్ధక్షేత్రానికి వెళ్లి దాడులను పర్యవేక్షించారు. మరో కమాండర్‌ బ్రోవ్కో కీలకమైన మిలటరీ-పొలిటికల్‌ వర్క్‌ విభాగానికి చెందిన ఆర్మీకోర్‌లో డిప్యూటీ కమాండర్‌గా చేస్తున్నాడు. శత్రువుతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి ఆయన కన్నుమూసినట్లు రష్యా పేర్కొంది. దొనెట్స్క్‌ ప్రాంతంలో బక్ముత్‌ నగరంలో కొన్ని నెలలుగా తీవ్రమైన పోరు జరుగుతోంది. ఇక్కడ రష్యా దళాలకు మద్దతుగా వాగ్నర్‌ ప్రైవేటు సైన్యం కూడా పనిచేస్తోంది. రష్యా దళాలు శనివారం ఒకేరోజు నాలుగు యుద్ధవిమానాలను కోల్పోయాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ స్థాయి నష్టాన్ని రష్యా వాయుసేన చవిచూడటం ఇదే తొలిసారి. రష్యా భూభాగంలోనే వీటిని కూల్చేసినట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని వార్త సంస్థలు రెండు విమానాలు, రెండు హెలికాప్టర్లు కూలినట్లు పేర్కొంటున్నాయి. ఈ వార్తలను మాస్కో ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img