Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉ.కొరియాలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

సియోల్‌ : ఉత్తరకొరియా మంగళవారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి తూర్పు తీరంలో పడినట్లు దక్షిణ కొరియా వెల్లడిరచింది. దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన నాలుగు రోజులకే ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ నెల ప్రారంభంలో ఉత్తరకొరియా బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులను పరీక్షిం చింది. ఆత్మరక్షణ కోసం ఆయుధాలను సమీకరిస్తామని వాటిని పరీక్షిస్తుంటామని ఉత్తర కొరియా రాయబారి బార్బర ఐక్యరాజ్య సమితిలో ప్రకటించారు. క్షిపణి ప్రయోగం గురించి తమకు తెలుసనని, అయితే ఇది అమెరికా సిబ్బందికి, మిత్రదేశాలకు ఎలాంటి ముప్పులేదని అమెరికా సైన్యం ఒక ప్రకటనలో వెల్లడిరచింది. తాజాగా జరిగిన పరీక్షపై జపాన్‌ మీడియా ద.కొరియా ప్రకటనను ధృవీకరించింది. బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించి ఉంటారని జపాన్‌ రక్షణ శాఖ పేర్కొంది. క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్‌ న్యూయార్క్‌లో జరుగుతున్న జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img