Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

క్యూబా సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలి

కానెల్‌ పిలుపు
హవానా : లాటిన్‌ అమెరికా దేశమైన క్యూబా దీర్ఘకాలిక సంస్కృతి, గుర్తింపు, ప్రముఖుల వారసత్వాన్ని కాపాడుకోవాలని క్యూబా అధ్యక్షుడు దియాజ్‌ కానెల్‌ పిలుపునిచ్చారు. హవానా విశ్వవిద్యాలయంలో కాడెనాస్‌ స్క్వేర్‌లో జరిగిన సమావేశంలో వివిధరంగాలకు చెందిన వందలాదిమంది యువకులతో జరిగిన సమావేశంలో కానెల్‌ పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ కార్మికులు, రైతులు, హమాలీ కాంట్రాక్టర్లు, విద్యార్థులు హాజరైన ఈ సమావేశంలో కానెల్‌ అమెరికా ప్రభుత్వంతో క్యూబా సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో సంస్కృతి కీలకమైన అంశంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. క్యూబాపై అమెరికా విధించిన ఆర్దిక, వాణిజ్య ఆంక్షలపై చారిత్రక కారణాలను యువత గుర్తించవలసి ఉందని ఆయన నొక్కిచెప్పారు. క్యూబన్లను అర్థం చేసుకోవడం, క్యూబన్‌గా గర్వపడటంపై కానెల్‌ యువతతో ప్రస్తావించారు. క్యూబన్‌ దేశ స్థాపన, గుర్తింపు, విలువలు ఏమిటి..? అనేది తెలిస్తే మాత్రమే ఇది సాధ్యపడుతుందని అన్నారు. ఈ తరంలో జన్మించిన యువతకు వాస్తవికతను కానెల్‌ వివరించారు. సమాజంలో ఉన్న నిరంకుశ ధోరణులను, సంస్కరణవాద అలోచనలు, జాతి వివక్షతను ఆయన ప్రస్తావించారు. జాత్యహంకార విధానాన్ని విడనాడి మేధస్సుతో వ్యవహరించవలసిన తీరును ప్రోత్సహించారు. దేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలో సంస్కృతి ప్రధానమైన అంశంగా కానెల్‌ పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తి, ప్రభుత్వ ప్రధాన లక్ష్యంకాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనను ప్రోత్సహించారు. కరోనా నియంత్రణలో ప్రజల ఆరోగ్యంకోసం పోరాడిన ఏకైకదేశం క్యూబాగా పేర్కొన్నారు.
క్యూబాకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ సంఫీుభావం
ఏథెన్స్‌ : క్యూబా ప్రభుత్వం, ప్రజలకు కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ గ్రీస్‌(కేకేఈ) సంఫీుభావం ప్రకటించింది. సామ్రాజ్యవా దానికి వ్యతిరేకంగా క్యూబా ప్రజల సుదీర్ఘ ప్రతిఘటన,వారి పోరాటం ప్రపంచ ప్రజలకు స్పూర్తిదాయకమని కేకేఈ నుండి యూరోపియన్‌ పార్లమెంటు సభ్యుడు నికోలౌ` అలవనోస్‌ వ్యాఖ్యానించారు. క్యూబా ప్రజలు, ప్రభుత్వం, క్యూబా కమ్యూనిస్టుపార్టీకి గ్రీకు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు సంఫీుభావం ప్రకటించారు. క్యూబా ఒంటరి కాదని, క్యూబా సామ్రాజ్యవాదంపై గెలుస్తుందని వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా తాజాగా విధించిన 243 ఆంక్షలను తొలగించాలని కేకేఈ డిమాండ్‌ చేసింది. కరోనా నియంత్రణలో ప్రపంచంలోని పెట్టుబడీదారీ దేశాలకు క్యూబా సహాయాన్ని అందించిన తీరును, కృషిని గుర్తు చేశారు. 60సంవత్సరా లకుపైగా అమెరికా క్యూబాపై విధించిన ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంపై కేకేఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశాన్ని అస్థిరపరచే ఏకపక్ష బలవంతపు చర్యలకు ముగింపు పలకాలని పేర్కొంది. క్యూబా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల ప్రదర్శనలను ఖండిరచింది. క్యూబాలో మానవాతా జోక్యాన్ని తుదముట్టించాలని పిలుపునిచ్చింది. బైడెన్‌ ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ,దురహంకారం పూరిత చర్యలను, రెచ్చగొట్టే విధానాలను నిస్సందేహంగా ఖండిస్తునానమని కేకేఈ ప్రకటించింది. క్యూబా హెన్రీరీవ్‌ మెడికల్‌ క్యాంప ్‌సాగించిన ప్రపంచవ్యాప్త విజయాలను ప్రస్తుతించింది. ప్రపంచవ్యాప్తంగా 250,000 మందికిపైగా చికిత్సను అందించిందని తనపై ఆంక్షలు విధించిన దేశాలకు కూడా క్యూబా మనవతా సహాయన్ని అందించిందని కేకేఈ ప్రస్తుతించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img