Friday, April 26, 2024
Friday, April 26, 2024

తాలిబన్ల ఆధీనంలో మరో అఫ్గాన్‌ నగరం

కాబూల్‌: ఆఫ్గానిస్తాన్‌పై తాలిబన్ల పట్టు రోజురోజుకూ బిగుస్తోంది. మే నెలలో అఫ్గాన్‌నుంచి విదేశీ బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటినుండి తాలిబన్లు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. ఏకంగా నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. జరాంజ్‌రాష్ట్ర రాజధాని నిమ్రోజ్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తాజాగా జౌజ్జాన్‌ రాష్ట్ర రాజధాని షెబెర్‌ ఘాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనితో కేవలం 24గంటల వ్యవధిలో తాలిబన్లు అఫ్గాన్‌లోని రెండు కీలక రాష్ట్రాలను వరశపరచుకున్నారు. షెబెర్‌ఘాన్‌పై తాలిబన్లు పట్టుబిగియడంతో అక్కడి బలగాలు, అధికారులు నగరం విడిచి పారిపోయారు. తాలిబన్‌ నాయకుడుఅబ్దుల్‌ రషీద్‌దోస్తుమ్‌కు షెబెర్‌ఘాన్‌ స్వస్థలం. టర్కీలో చికిత్స పొంది దోస్తుమ్‌ వారం క్రితమే ఇక్కడకు వచ్చాడు. పక్కా స్కెచ్‌తోనే నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
అఫ్గాన్‌్‌ మీడియా విభాగ అధిపతి హత్య అఫ్గాన్‌్‌ ప్రభుత్వ మీడియా విభాగ అధిపతి దవా ఖాన్‌ మెనాపాల్‌ను శుక్రవారం కాల్చిచంపారు. ఈ విషయాన్ని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. మెనాపాల్‌కు ‘తగిన శాస్తి’ జరిగిందని ఆయన వ్యాఖ్యానించాడు. అఫ్గాన్‌్‌ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలిగిన తర్వాత తొలిసారిగా తాలిబన్లు నిమ్రోజ్‌ ప్రావిన్షియల్‌ రాజధాని జరాంజ్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు.
అఫ్గాన్‌లో అమెరికన్లకు బైడెన్‌పిలుపు అఫ్గాన్‌లో నివసిస్తున్న తమ దేశీయులు తక్షణమే ఆ దేశాన్ని వదిలి రావాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కాబూల్‌లోని యుఎస్‌ ఎంబసీ శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తాలిబన్లకు, అఫ్గ్గాన్‌ దళాలకు మధ్య పోరు తీవ్రమవుతున్న తరుణలో తాలిబన్ల నుంచి ముప్పుఉన్న కారణంగా దేశంలో భద్రతలేదని పేర్కొంది. అఫ్గ్గాన్‌లో అమెరికా బలగాలు, స్టాఫ్‌కూడా పరిమితంగాఉన్నారని , అందువల్ల దాడుల నుంచి మిమ్మల్ని రక్షించలేకపోవచ్చునని ఈ ప్రకటన స్పష్టం చేసింది. విమానాలకు టికెట్‌ కొనలేనివారికి అవసరమైతే రుణం ఇస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img