Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

చైనా, అంగోలా దౌత్యబంధానికి 40ఏళ్లు

పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న అధ్యక్షులు

బీజింగ్‌: చైనా, ఆంగోలా దౌత్యబంధానికి 40ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా రెండు దేశాల అధ్యక్షులు జిన్‌పింగ్‌, జావో లారెన్‌కో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చైనా, అంగోలా నిబద్ధతగల మిత్రదేశాలని జిన్‌పింగ్‌ అన్నారు. తమ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాయన్నారు. మంచి అవగాహనతో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయని జిన్‌పింగ్‌ చెప్పారు. రెండు దేశాలకు అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు ఉండగా వాటితో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. దౌత్యబంధానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిన్‌పింగ్‌ తెలిపారు. 40ఏళ్ల దౌత్య బంధాన్ని మరింత పటిష్టపర్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. లారెన్‌కోతో కలిసి పని చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. తమ వూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ట పర్చుకుంటూ కొత్త అధ్యయాన్ని లిఖిస్తామన్నారు. లారెన్‌కో స్పందిస్తూ అంగోలా`చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వచ్చాయన్నారు. అనేక అంతర్జాతీయ అంశాలకు సంబంధించి తమ రెండు దేశాల మధ్య అవగాహన ఉన్నట్లు తెలిపారు. తమ స్నేహ, సహకార సంబంధాలను మరింత బలపర్చుకుంటామని చెప్పారు. రెండు దేశాలకు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లోనూ చర్యలు తీసుకుంటామన్నారు. సంయుక్తంగా పురోగతి, సుసంపన్నత, సమృద్ధికి కట్టుబడి ఉన్నామని అంగోలా అధ్యక్షుడు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img