Friday, May 3, 2024
Friday, May 3, 2024

జూన్‌ 2 వరకు ఇమ్రాన్‌కు ఉపశమనం


అరెస్టు నుంచి రక్షణగా బెయిలిచ్చిన ఏటీసీ కోర్టు
లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఈనెల 9 తర్వాత దాఖలైన మూడు కేసుల్లో జూన్‌ 2 వరకు అరెస్టు చేయొద్దని లాహోర్‌ ఏటీసీ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగస్వాములు కావాలని 70ఏళ్ల పీటీఐ చైర్మన్‌కు ఆదేశాలిచ్చింది. లాహోర్‌లో కార్ప్సొ కమాండర్‌ హౌస్‌పై దాడికి సంబంధించి కూడా ఇమ్రాన్‌పై కేసు ఉన్నది. ఏటీసీ కోర్టురూమ్‌ వద్ద విలేకరులతో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ 35ఏళ్లలో ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. దేశంలో పౌర`ప్రాథమిక హక్కులు, స్వచ్ఛ అంతమైపోయినట్లు ఉన్నదని, కేవలం కోర్టులే మానవహక్కులను పరిరక్షిస్తున్నాయని అన్నారు. చివరి బంతి వరకు వెనక్కు తగ్గేదే లేదని చెప్పారు. ఏటీసీ ఆవరణలోకి తన వాహనానికి అనుమతిచ్చాకే విచారణకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img