Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాటో దేశాలపై దాడిచేసే ఉద్దేశం లేదు : పుతిన్‌

మాస్కో: నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ త్రోసిపుచ్చారు. కానీ, ఉక్రెయిన్‌ కు పశ్చిమ దేశాలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. టోర్జోక్‌ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలీకాఫ్టర్‌లోని సిమ్యులేటర్‌లో కూర్చుని దాన్ని పరిశీలించారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛినమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది కానీ నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన తమకు లేదన్నారు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌లపై రష్యా దాడి చేస్తుందన్న పశ్చిమ దేశాల వాదనలో నిజం లేదని పుతిన్‌ తేల్చి చెప్పారు. అమెరికాతో రష్యా సంబంధాలు ఇంతవరకూ దిగజారలేదన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, ఎఫ్‌-16లను ఇచ్చినా వాటిని కూల్చివేయడం ఖాయమన్నారు. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా కూడా అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పుతిన్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img