Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత్‌, చైనా ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు

ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించుకోవాలని సూచన
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై అమెరికా స్పందించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఘర్షణ తర్వాత భారత్‌, చైనా రెండూ త్వరగా వెనక్కివెళ్లడం పట్ల బైడెన్‌ యంత్రాంగం సంతోషంగా ఉందని వైట్‌హౌస్‌ పేర్కొంది. వైట్‌హైస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కైర్నే జీన్‌-పియర్రే మాట్లాడుతూ.. తవాంగ్‌ సెక్టార్‌లో పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. వివాదాస్పద సరిహద్దులపై చర్చించడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించుకోవాలని ఇరుపక్షాలను అమెరికా ప్రోత్సహిస్తుందని అన్నారు.‘‘తవాంగ్‌ సెక్టార్‌లో ఘర్షణ తర్వాత భారత్‌, చైనాలు తక్షణమే ఘర్షణను ముగించడం సంతోషకరం.. పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోంది.. వివాదాస్పద సరిహద్దులపై చర్చించడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించుకోవాలని ఇరుపక్షాలను బైడెన్‌ యంత్రాంగం ప్రోత్సహిస్తుంది’’ అని జీన్‌ పియర్నే పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో యాంగ్జే ప్రాంతం వద్ద డిసెంబరు 9న వాస్తవాధీన రేఖ వెంబడి సున్నితమైన ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకురాగా భారత బలగాలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది.తవాంగ్‌ వద్ద జరిగిన ఘర్షణలో ఆరుగురు భారత జవాన్లు గాయపడగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img