Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మైన్మార్‌లో నలుగురు రాజకీయ నేతలకు ఉరి

యంగూన్‌్‌: మాజీ ఎంపీ సహా నలుగురు రాజకీయ నాయకులపై మైన్మార్‌ సైనిక ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. దేశంలో దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఉరి శిక్ష విధించబడిరది. మాజీ ఎంపీ ఫోయో జియా థావ్‌, రచయిత కో జిమ్మీ, హలా మియా ఆంగ్‌, ఆంగ్‌ తురా జాలకు మరణశిక్ష అమలు చేసినట్లు మైన్మార్‌ జుంటా ఆర్మీ ప్రకటించింది. జూన్‌ లోనే నలుగురికి మరణశిక్ష విధిస్తూ మయన్మార్‌ ఆర్మీ ప్రకటన చేసింది. దానిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అయితే గత ఏడాది మైన్మార్‌ సైన్యం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ సమయంలో ఆర్మీ రంగ ప్రవేశం చేసి ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నది. తన భర్తను ఉరితీసినట్లు తనకు తెలియదని థావ్‌భార్య తెలిపారు. యంగూన్‌లోని ఇన్‌సెయిన్‌ చెరసాలలో ఆ నలుగుర్నీ ఉరి తీశారు. ఉరికి ఒక రోజు ముందు ఆ నలుగురు తమ తమ కుటుంబాలతో జూమ్‌ సమావేశంలో మాట్లాడారు. యంగూన్‌లో ఉన్న శ్మశానవాటికలోనే ఆ నలుగురికీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం, కరోనా నిబంధనలను ఉల్లంఘించడం వంటి అభియోగాలపై ప్రత్యేక న్యాయస్థానం సూకీని దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్ష ఖరారు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img