Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మైన్మార్‌లో అత్యవసర చర్యలు : ఐరాస

న్యూయార్క్‌ : మైన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్‌ బెర్గ్నర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐరాస భద్రతామండలికి క్రిస్టినా విన్నవించారు. మైన్మార్‌ సమస్యలపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా పరిస్థితులు చక్కబెట్టేందుకు కంకణం కట్టుకోవాలని ఆమె భద్రతామండలి సమావేశంలో కోరారు. 2021 ఫిబ్రవరిలో మైన్మార్‌లో తలెత్తిన సైనిక తిరుగుబాటుతో ఇప్పటివరకు 600 మంది మృతి చెందారు. 6000 మందికిపైగా అరెస్టయ్యారు. 5000 మందికిపైగా సైన్యం అదుపులో ఉన్నారు. మైన్మార్‌ ప్రజలు దాదాపు 10వేల మందికిపైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. మైన్మార్‌లో ఆరోగ్యవ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఆహారభద్రత తీవ్ర ప్రమాదంలో ఉంది. కొవిడ్‌తో పరిస్థితి మరింతగా దిగజారింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని మైన్మార్‌ సైనిక ప్రభుత్వానికి భద్రతామండలి విజ్ఞప్తి చేసినట్లు క్రిస్టినా తెలిపారు. మైన్మార్‌లో ఇటువంటి హింసను ఇంతకుముందెన్నడూ చూడలేదని అన్నారు. మైన్మార్‌ ఆయుధాలు నిషేధించాలంటూ ఐరాస జనరల్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మైన్మార్‌ తిరస్కరించింది. మైన్మార్‌ మిలిటరీ ఫిబ్రవరిలో జరిగిన తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం శుక్రవారం ఖండిరచింది. దేశంపై ఆయుధాల నిషేధాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఆంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ పార్టీ జెండాను తిరుగుబాటు వ్యతిరేక నిరసనకారులు పట్టుకోగా, మరికొందరు మైన్మార్‌్‌లోని యాంగోన్‌లో గల బహాన్‌ టౌన్‌షిప్‌లో జరిగిన ‘ఫ్లాష్‌ మాబ్‌’ ర్యాలీలో మూడు వేళ్ల సెల్యూట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img