Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యూఎస్‌ సుప్రీంకోర్టు జడ్జిగా కేతాంజీ బ్రౌన్‌ ప్రమాణం

మొదటి నల్ల జాతీయురాలిగా చరిత్ర

వాషింగ్టన్‌: కేతాంజీ బ్రౌన్‌ జాక్సన్‌ (51) గురువారం అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థలో మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 1973 రోయ్‌ వర్సెస్‌ వేడ్‌ ల్యాండ్‌మార్క్‌ను కోర్టు రద్దు చేసిన ఆరు రోజుల తర్వాత రిటైర్‌ అయిన లిబరల్‌ జస్టిస్‌ స్టీఫెన్‌ బ్రేయర్‌ స్థానంలో ఆమె ప్రమాణం చేశారు. కోర్టులో అత్యంత సీనియర్‌ సభ్యుడైన 83 ఏళ్ల బ్రేయర్‌ గురువారం అధికారికంగా పదవీ విరమణ చేశారు. ‘కోర్టు సభ్యులందరి తరపున, జస్టిస్‌ జాక్సన్‌ను కోర్టుకు స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ఈ సందర్భంగా జరిగిన వేడుకలో అన్నారు. జాక్సన్‌ 116వ న్యాయమూర్తి, ఆరవ మహిళ. 1789 నుంచి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న మూడవ నల్లజాతి వ్యక్తి. ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జిగా ఎనిమిదేళ్లు పనిచేశారు. అధ్యక్షుడు బైడెన్‌ ఆమెను సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img