Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యాలో విలీనానికి ఉక్రెయిన్‌ ప్రాంతాల మొగ్గు

కీవ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం అధికారికంగా 15 శాతం ఉక్రేనియన్‌ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. రష్యాకు నాలుగు ఉక్రేనియన్‌ ప్రాంతాలను కలుపుకునేందుకు క్రెమ్లిన్‌లో సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ, ‘‘రష్యన్‌ ఫెడరేషన్‌లో కొత్త భూభాగాల ప్రవేశానికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ’’ శుక్రవారం ప్రారంభమైంది. రిఫరెండమ్‌లు నిర్వహించిన డొనాట్స్‌క్‌లో 99శాతం, లుహాన్స్‌క్‌లో 98శాతం,జపోరిజియాలో 93శాతం,ఖెర్సన్‌లో87శాతం రష్యాలో విలీనానికి ఓటువేశారు. రష్యాలో ప్రాంతాలను విలీనం చేయాలనే పుతిన్‌ నిర్ణయం అంటే మాస్కో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని విస్తారమైన ప్రాంతాలను కలుపుతుంది, ఇది ఉక్రెయిన్‌ మొత్తం భూభాగంలో 15 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రెమ్లిన్‌లో సంతకాల వేడుకల అనంతరం పుతిన్‌ ప్రధాన ప్రసంగం చేస్తారని, ఉక్రెయిన్‌ ప్రాంతాల నిర్వాహకులతో సమావేశమవుతారని క్రెమ్లిన్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img