Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వరుస భూకంపాలతో వణికిన చైనా

ఉయ్‌గుర్‌ : చైనాను వరుసగా భూకంపాలు వణికిస్తుండగా ఉయ్‌గుర్‌ ప్రావిన్స్‌ జీన్‌జీయాంగ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జాంగుయ్‌ టౌన్‌షిప్‌, షాచే కౌంటీ ప్రాంతాల్లో శనివారం ఉదయం 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. వీటినుంచి తేరుకోక ముందే.. తాజాగా యెచెంగ్‌ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున 1.52 గంటలకు భూకంపం వచ్చినట్లు చైనా వెల్లడిరచింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ (సీఈఎన్‌సీ) ప్రకటించింది. శనివారం ఉదయం 6.58 గంటలకు జాంగుయ్‌ టౌన్‌షిప్‌లో 4.6 తీవ్రతతో, 7.24 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలిపింది. భూకంప కేంద్రాలు జాంగ్‌గుయ్‌కు 87 కిలోమీటర్లు, షాచే కౌంటీ ప్రాంతానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టులో హైతీలో ఘోరమైన భూకంపం సంభవించింది. 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 2,207 మంది ప్రజలు మరణించారు. ఇంకా 344 మంది ఆచూకీ లభించలేదని హైతీ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img