Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వెనిజులాలో పాలక పార్టీ విజయం
కారకస్‌ : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధికార సోషలిస్టు పార్టీ, మిత్రపక్షాలు 23 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో విజయం సాధించాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు చెందిన యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ వెనిజులా (పీఎస్‌యూవీ), దాని మిత్రపక్షాలు నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా ప్రతిపక్షం పాల్గొన్న ఎన్నికల్లో పెద్ద విజయం సాధించారు. 21 మిలియన్ల మంది ఓటర్లలో 8,1 శాతం మంది ఓటు వేయడంతో పోలింగ్‌ శాతం 41.8శాతం నమోదైంది. వెనిజులా ప్రభుత్వం సాధించిన విజయాలకు గాను క్యూబా అధ్యక్షుడు కానెల్‌ అభినందనలు తెలిపారు. 23 మంది గవర్నర్లు, 335 మంది మేయర్లకు, 235మంది ఎంపీలకు, 2471 మంది కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలుజరిగాయి. అన్ని రాజకీయపార్టీలకు చెందిన దాదాపు 70వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 37 జాతీయ రాజకీయ పార్టీలకు, 43 ప్రాంతీయ సంస్థలకు వీరు ప్రాతినిధ్యం వహించారు. 55 దేశాలు, సంస్థల నుంచి 300 మందికి పైగా రాజకీయ పరిశీలకులు ఈఎన్నికలను పర్యవేక్షించారు. 2017 తరువాత ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం ఇదే..15 ఏండ్ల తర్వాత యూరోపియన్‌ యూనియన్‌ పరిశీలకులు వెనిజులాకు వచ్చారు. 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు, ఆ తర్వాత రెండేండ్లకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఈ ఎన్నికలు జరిగాయి. దారుణమైన యుద్ధాన్ని అనుభవించిన ప్రజలు అందించిన ప్రజా విజయంగా మదురో వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img