Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

104 లో పనిచేయని ఈసీజీ

ఎన్టీఆర్ జిల్లా – వత్సవాయి : 104 ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ 104ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రుల వద్దకు రాలేని వారికి వైద్య సదుపాయాలను అందించాలని మహోన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 104 లను మండలాల వారీగా కేటాయించడం జరిగింది….. ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే 104 లో ఉండే సిబ్బంది ఆ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారు….. వత్సవాయి మండలంలో 104 లో ఈసీజీ పనిచేయక సుమారు సంవత్సరకాలం గడిచినా కూడా నేటి వరకు కూడా దానిపై సిబ్బంది కానీ పర్యవేక్షకులు కానీ దృష్టి సారించలేదు సిబ్బంది వారికి ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేసే క్రమంలోనే పని చేస్తున్నారు అని బాధితులు వాపోతున్నారు…..సమయపాలన లేకుండా వారికి ఆరోజు కేటాయించిన గ్రామాలకు సిబ్బంది వెసులుబాటును బట్టి ఆ గ్రామాలకు చేరుకోవడంతో రోగులు 104 కోసం పడిగాపులు కాస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు….. గ్రామాల్లో కేవలం నామమాత్రపు వైద్యాన్ని మాత్రమే 104 సిబ్బంది అందిస్తున్నారని మరియు జీతాలు సక్రమంగా రాకపోవడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం తో కూడిన జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.….. నెలల పాటు ఈసీజీ పనిచేయకపోవడంతో సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ 104 పై పూర్తి నియంత్రణ మరియు సమయపాలనపై వారు అందించే సేవలు వైద్య పరీక్షలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని సిబ్బంది టైం పాస్ ఉద్యోగాలు చేస్తున్నారని పలువురు వృద్ధులు వారి వారి వాదనలను వినిపిస్తున్నారు కేవలం బీపీ షుగర్ సమయానికి అందుకున్న గర్భిణీ స్త్రీలకు మాత్రమే చూసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు అంటున్నారు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో రక్ష పరీక్షలు మరియు ఈసీజీ ఇంకెంతకాలానికి బాగుచేస్తారో అని వృద్ధులు ఎదురుచూస్తున్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img