Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అఫ్గాన్‌ నూతన అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్‌ ఘనీ..!


కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడిగా అష్రఫ్‌ ఘనీ రాజీనామా చేయడంతో తాలిబన్‌ కమాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌ పరిపాలనా పగ్గాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ సంధానకర్తల మధ్య చర్చల తరువాత నూతన అఫ్గాన్‌ ప్రభుత్వానికి ముల్లా అబ్దుల్‌ను దేశ అధ్యక్షుడుగా ప్రకటించింది. అబ్దుల్‌ ఘనీ..అఫ్గాన్‌ ముజాహిద్‌ కమాండర్‌ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్‌ సంస్థకు పనిచేశారు. తాలిబన్ల పాలనలో రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. 2010లో పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్టు చేశారు. 2018 అక్టోబరు 24 వరకు ఘనీ పాక్‌ జైలులో ఉన్నారు. అమెరికా జోక్యంతో జైలు నుంచి విడుదలయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img