Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అఫ్గాన్‌లో మరో ఉగ్రదాడికి కుట్ర : బైడెన్‌

వాషింగ్టన్‌ : కాబూల్‌ విమానాశ్రయంపై రానున్న 2436 గంటల్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం లభించిందన్నారు. ఐసిస్‌కే ఉగ్రవాదులు లక్ష్యంగా జరిగిన డ్రోన్ల దాడి ఆఖరిది కాదని బైడెన్‌ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా బృందంతో సమావేశమైన బైడెన్‌ అఫ్గాన్‌ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందన్నారు. విమానాశ్రయ పరిసరాల్లో ఎవరూ ఉండవద్దని అఫ్గాన్‌లోని అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైనికుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా బైడెన్‌ ఆదేశాలు జారీచేశారు. వారికి కావలసిన వసతులు, సహకారాలు అందించాలన్నారు. గురువారం నాటి దాడులకు కారణమైన ఐసిస్‌`కే పై మరిన్ని దాడులు జరుగుతాయన్నారు. అమెరికాకు హాని తలపెడితే సహించేదిలేదని బైడెన్‌ స్పష్టం చేశారు. 350 మంది పౌరులు ఇంకా అమెరికాలోనే ఉన్నారని తెలిపారు. శుక్రవారం 6800 మందిని అఫ్గాన్‌ నుంచి తరలించామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img