Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు

వాషింగ్టన్‌ : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా, నెవాడా సరిహద్దు అడవుల్లో మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. 72 కిలోమీటర్ల పరిధిలో వృక్ష సంపద నాశనమైనట్లు అధికారుల పేర్కొన్నారు. 1913 తరువాత ఇంత పెద్ద మొత్తంలో కార్చిచ్చు రేగడంతో పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. మొహావే కౌంటీలో అగ్ని తీవ్రతకు చిన్న విమానం పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. ఈ కార్చిచ్చు ఆదివారం నాటికి 83,256 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపకదళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దక్షిణ ఒరెగాన్‌లోని 311 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీప్రాంతం కాలిబూడిదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని వేలాదిమంది ప్రజలు తమ నివాసాలను ఖాళీచేయడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విద్యుత్‌ కోతలను అధిగమించడానికి వీలైనంత తక్కువగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని విద్యుత్‌ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం ఐదు గంటల ‘ఫ్లెక్స్‌ అలర్ట్‌’ను ప్రకటించారు. మంటలు 120 చదరపు మైళ్లకు రెట్టింపు అయ్యాయి. మొజావే ఎడారిలో 53 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదుకాగా 1913 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. కాలిఫోర్నియా ఈశాన్యప్రాంతంలో 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగిసిపడుతున్నట్లు అటవీ అధికారి కాక్స్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img