Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎట్టకేలకు గొటబాయ రాజీనామా

సింగపూర్‌కు చేరుకున్నాకే ప్రకటన
ఆ షరతుతోనే పదవిని వీడటంలో జాప్యం
ఆపద్ధర్మ అధ్యక్షుడిగా విక్రమసింఘె

కొలంబో: ప్రజాగ్రహానికి గురైన దేశాన్ని వీడిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన రాజీ నామాను గురువారం సమర్పించారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు పలాయనం సాగించిన తర్వాత ఈ మెయిల్‌ ద్వారా రాజీనామా లేఖను పంపారు. వాస్తవానికి ఈనెల 12న రాజీనామా చేయాలిగానీ కుటంబసమేతంగా సురక్షితంగా దేశం వీడే షరతుతో దానిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ రాజీనామా చేయకపోతే గొటబాయను పదవి నుంచి తప్పించాలంటే శ్రీలంక రాజ్యాంగం ప్రకారం మొత్తం న్యాయవ్యవస్థ సహకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పార్లమెంటులో రెండిరట మూడొంతుల మంది ఆయనకు వ్యతి రేకంగా ఓటు వేయాలి. అయితే తాజా పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదుగనుకనే గొటబయ డిమాండ్లకు రణిల్‌ విక్రమసింఘే, వైమానిక దళం సహకరిం చినట్లు సమాచారం. దేశాలు దాటిన అనంతరం గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని శ్రీలంక పార్లమెంటు ధ్రువీకరించింది. స్పీకర్‌ మహింద్ర అభయవర్ధనకు గొటబాయ రాజీనామా లేఖ అంది నట్లు తెలిపింది. గొటబాయ రాజీనామా వార్త అక్కడి ప్రజల్లో ఆనందాన్ని నింపింది. వారు సంబురాలు జరుపుకున్నారు. తొలుత మాల్దీవులకు వెళ్లిన గొటబాయకు అక్కడ నిరసన సెగ తగిలింది. దీంతో ఆయన సింగపూర్‌కు చేరుకున్నారు. పరిస్థితులు చేయి దాటడంతో అధ్యక్షుడిగా రాజీనామా చేస్తు న్నట్లు గొటబాయ ప్రకటించారు. ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటన కర్ఫ్యూ విధింపు ` ఆగని ఆందోళనలు : తాజా పరిస్థితుల్లో అత్యవసర స్థితిని శ్రీలంక యంత్రాంగం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులు శాంతిం చడం లేదు. దేశ పరిస్థితి మెరుగయ్యే సూచనలు లేవు. గురువారం కూడా ఆందోళనకారులు విక్రమసింఘె అధికారిక నివాసాన్ని ముట్టడిరచారు. వేలాదిగా అక్కడకు చేరుకొని బారికేడ్లు విరగొట్టారు. ప్రధాన ద్వారాన్ని దాటుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతాబలగాలు అడ్డుకొని బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టాయి. కొందరు ముందుజాగ్రత్తగా వివిధ రకాల మాస్కులు ధరించి రావడంతో వారిపై బాష్పవాయువు ప్రభావం చూపలేదు. రాళ్లు, సీసాలు, చెప్పులను భద్రతా బలగాలపైకి నిరసనకారులు విసిరారు. విక్రమసింఘె నివాసం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి అధికారిక భవనంలోకి చొరబడి లాన్స్‌, స్టెప్స్‌, సమావేశ మందిరాలలోకి ఆందోళకారులు ప్రవేశించారు. సంయమనం పాటిస్తారా చర్యలను ఎదుర్కొంటారా అంటూ నిరసనకారులను దేశ సైన్యం గదమాయించింది. గురువారం ఉయయం కర్ఫ్యూను ఎత్తివేసినప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే క్రమంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తిరిగి నిషేధాజ్ఞలను అమలు చేసింది. ఎమర్జెన్సీ విధించిన క్రమంలో పార్లమెంటు వద్ద యుద్ధట్యాంకర్లను సిద్ధంగా ఉంచింది. ఆందోళనకారులు ఎవ్వరూ పార్లమెంటు వద్దకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇదే క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఏమి చేయగలరో అంతా చేయండి అని సైన్యానికి విక్రమసింఘె బుధవారమే ఆదేశాలివ్వడం విదితమే.
ఆశ్రయం ఇవ్వలేదు : సింగపూర్‌
గొటబాయ కుటుంబం తమ దేశానికి రావడం నిజమేగానీ అది వారి వ్యక్తిగత పర్యటన అని సింగపూర్‌ ప్రభుత్వం తెలిపింది. తామేమీ ఆశ్రయం కల్పించలేదని, అందుకోసం ఆయన కోరలేదని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడిరచింది.
మా ప్రమేయం లేదు : భారత్‌ హైకమిషన్‌
గొటబాయ రాజపక్సే దేశం విడిచి వెళ్లడానికి భారత ప్రభుత్వం సహకరించినట్లు జరిగిన ప్రచారాన్ని హైకమిషన్‌ తీవ్రంగా ఖండిరచింది. ఇందులో భారత్‌ ప్రమేయం లేదని ప్రకటించింది. ‘శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే మాల్దీవులకు వెళ్లడానికి భారత ప్రభుత్వం సహకరించిందన్న వార్తలు నిరాధారం. వీటిని హైకమిషన్‌ ఖండిరచింది’ అని మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ తెలిపింది.
మహీంద్ర, బసిల్‌ ఎక్కడికీ వెళ్లరు..
శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణ జరిగేంత వరకు మాజీ ప్రధాని మహీంద్ర రాజపక్సే, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్‌ రాజపక్సే దేశాన్ని విడిచి వెళ్లరని వారి న్యాయవాదులు గురువారం వెల్లడిరచారు. వీఐపీ టర్మినల్‌ ద్వారా దేశాన్ని వీడేందుకు గొటబాయ సోదరుడు బసిల్‌ ప్రయత్నించిన క్రమంలో ఆయనపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ఏప్రిల్‌లో ఆర్థిక మంత్రిగా తప్పుకున్న బసిల్‌ జూన్‌లో పార్లమెంటు స్థానాన్ని వీడారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఈయనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. మహీంద్ర రాజపక్సే మే 9న ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం కావడంతో ఆయన రాజీనామా సమర్పించారు. అప్పట్లోనే ఈయన విదేశీయానాన్ని నిషేధిస్తూ శ్రీలంక కోర్టు ఒకటి ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img