Friday, May 3, 2024
Friday, May 3, 2024

పెరూలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

తాజాగా ఒకరి మృతి `34 మందికి గాయాలు
లిమా: పెరూలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. కుస్కో నగరంలో తాజాగా జరిగిన ఆందోళనల్లో ఒకరు మరణించగా 34 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురు పోలీసులు, 28 మంది నిరసనకారులు ఉన్నట్లు మీడియా గురువారం వెల్లడిరచింది. అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అల్లర్ల క్రమంలో కాల్పులు జరిపిన నేపథ్యంలలో 50ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే భద్రతా సిబ్బంది వద్దనున్న హాండ్‌గన్స్‌లో బుల్లెట్లు లేవని, పెల్లెట్‌ తగిలి మరణం సంభవించి ఉండవచ్చు అని కుస్కో అటార్నీ పేర్కొన్నారు. ఇదిలావుంటే, జులియాకా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘర్షణల్లో మరణించిన వారికి స్థానికులు ఘనంగా నివాళులర్పించారు. జులియాకాలో శవపేటికలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన నిరసనల్లో చనిపోయిన వారికి జులియాకా ప్రధాన కూడలి వద్ద నివాళులర్పించారు. ఆగేయ పెరూలోని జులియాకా విమానాశ్రయం సమీపంలో సోమవారం ఘర్షణల్లో 17 మంది మరణించారు. వారిలో ఇద్దరు యువకులున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశాయి. కాగా దేశాధ్యక్షురాలు దీనా బోలువార్టే రాజీనామాకు నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో అరెస్టు జరిగిన తర్వాత వారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు 47 మంది నిరసనకారులు మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img