Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం అభివృద్ధి: ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి

శ్రీ చైతన్య లో అట్టహాసంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డు లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయంగా సైన్స్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. నేటి ఆధునిక యుగంలో సైన్స్ ప్రాముఖ్యత ఎంతగానో పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులు సైన్స్ కు సంబంధించి తయారుచేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు ప్రధాన ఆకర్షణీయంగా నిలిచాయన్నారు. సైన్స్ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రైల్వే లోకో పైలట్ రవిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి, డీన్ వెంకటసుబ్బయ్య,సి బ్యాచ్ ఇంచార్జ్ శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ కుటుంబరావు, ప్రైమరీ ఇన్చార్జి కస్తూరి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img