Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీడీపీలో అసెంబ్లీ సీట్లు ఇచ్చేదెవరు…?

చంద్రబాబు గొప్పా….? గన్నీ …..గొప్పా….?
అయోమయంలో తెలుగు తమ్ముళ్ళు ….?

విశాలాంధ్ర`చాట్రాయి : తెలుగుదేశం పార్టీ నూజివీడు అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చేది ఎవరు….? తెచ్చేది ఎవరు….? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడా…? ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులా…..?ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని అయోమయం నెలకొందని జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పేది పిట్టలదొర కధను తలపించేలా వుందని పలువురు వ్యంగంగా చెప్పుకోవడం గమనార్హం. సుమారు గత ఎడెనిమిది నెలలు క్రితం చంద్రబాబు నాయుడు ఆగిరిపల్లి రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గా వున్న ముద్దరబోయిన అనుచరులు నియోజకవర్గ పరిధిలో సీనియర్‌ మోస్ట్‌ లీడర్‌ మాజీ ఎఎంసి చైర్మన్‌ కాపా శ్రీనివాసరావును చంద్రబాబు దరిదాపులలోకి రాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకోవడమే కాకుండా కమ్మ సామాజిక వర్గాకి చెందిన మహిళలు చంద్రబాబుకి స్వాగతం పలికి పూలమాలలు వేయడానికి వచ్చిన వారిని పరష పదజాలంతో, కులంపేరుతో దూషించడం వలన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.ఆ రోజు వరకూ టీడీపీలో అంతర్గత విబేధాలు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు తప్ప పెద్దగా విబేధాలు బయటపడిన సందర్భం లేదనే చెప్పాలి. ముద్దరబోయినకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వుండేది. ఆగిరిపల్లి ఘటనతో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే సీన్‌ రివర్స్‌ అయింది. అధిష్టానం వద్ద కాపా శ్రీనివాసరావు పట్టుబిగించారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలయింది. తరువాత కోవర్టులు సస్పెన్షన్‌ లు అంటూ ముద్దరబోయిన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వివాదం ముదిరిపాకానబడిరది. కోవర్టులు అని చెప్పే ముద్దరబోయిన వారికి ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాళ్ళు చెప్పిందే అప్పుడు వేదం .ఇప్పటికీ సమన్వయమే లేదు. ఇన్ని విషయాలు తెలిసిన గన్ని వీరాంజనేయులు గత కొద్ది రోజుల క్రితం నూజివీడు మండలంలో పార్టీ కార్యక్రమానికి వచ్చి ఒకసభలో మాట్లాడుతూ. కాబోయే నూజివీడు ఎంఎల్‌ఎ ముద్దరబోయిన అని మాట్లాడటం పై అందరూ నవ్వకుంటున్నారు.అస్సలు సీటు ఇచ్చేది ఎవరు?.. నిర్ణయించేది ఎవరని చర్చ మొదలయింది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు పార్టీలో ఎప్పుడూ సమన్వయం కన్నా గ్రూపులుంటేనే ఆయనకు ఇష్టమని పలువురు అంటున్నారు. చాట్రాయి మండలంలో వైసిపి పార్టీలో అతి పెద్ద ఏకైక నాయకుడు దేశిరెడ్డిరాఘవరెడ్డితో మంచి సంబంధాలు వుండేవని అంటున్నారు. దేశిరెడ్డి శస్త్ర చికిత్స చేయించుకుంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ముద్దరబోయిన నాయకత్వంలో ప్రముఖ నాయకులంతా వెళ్లి పరామర్శించారని గుర్తు చేసుకుంటున్నారు. పేపర్లో కూడా అప్పట్లో పెద్ద పెద్ద కథనాలు వచ్చాయంటున్నారు.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన చనుబండకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి మోరంపూడి శ్రీనివాసరావు అంచనాలు వేయిస్తే ఎంపీ వర్గంలో వున్నందున అతనిపై కక్షకట్టి చనుబండ స్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేసారంటున్నారు.ఇప్పుడు అదే మోరంపూడితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.కనీసం ఆ గ్రామంలో ఇప్పుడు అందరూ ఒకే గ్రూపు అయినా సమన్వయం లేదంటున్నారు.ఒక సందర్బంలో ముద్దరబోయిన కార్యాలయంలో కూర్చీలు విరగకొట్టుకున్నారని పలువురు అంటున్నారు. ముద్దరబోయిన చనుబండలో పోటీ నాయకత్వాన్ని ప్రోత్సహించినా వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలవలేని పరిస్థితి. ముద్దరబోయిన వర్గంవారు అక్రమ విద్యుత్‌ వాడుకుంటూ అధికారులకు సూరంపాలెం దొరికిపోయి వేలాది రుపాయలు ఫైన్‌ వేయగా వారిని కాపాడటానికి వైసిపి నేత దేశిరెడ్డిరాఘవరెడ్డి బలమైన ఫైరవి చేసినా ఫలితం దక్కని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. వైసిపి ఇంత బలంగా వున్నా కృష్ణా రావు పాలెం ఎంపిటిసి అభ్యర్థి ఊట్లధనలక్ష్మి టీడీపిగా గెలిచే పరిస్థితి వున్నా ముద్దరబోయిన ముఖ్య అనుచరుడు దేశిరెడ్డి రాఘవరెడ్డితో చేతులు కలిపి వైసిపి గెలుపునకు సహకరించారని బలంగా రుజువుఅయినా పట్టించుకున్న దాఖలాలు లేవని అటువంటి వారిని వెంటేసుకుని తిరిగేవారు ఎలా గెలవగలరు …? చాట్రాయిలో ముద్దరబోయిన సొంత మనుషులు కొంత మంది వైసిపి గా రాఘవ రెడ్డి సొంత మనుషులుగా చలామణిలో వున్నట్లు వినికిడి..వీళ్ళకు జిల్లా నాయకుల వత్తాసు అని పలువురు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img